రేపే ఓట్ల లెక్కింపు.. సీతక్కకు సీఎంగా అవ‌కాశం?

byసూర్య | Sat, Dec 02, 2023, 11:01 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎంపిక చేశామ‌ని సీఈవో వికాస్‌రాజ్ వెల్ల‌డించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను, అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతామ‌ని పేర్కొన్నారు.
తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు అత్య‌ధిక సీట్లు వ‌స్తాయ‌ని మెజారీటి సర్వే సంస్థలు.. ఎగ్జిట్ పోల్స్ ద్వారా అంచ‌నా వేశాయ. అంచ‌నాల ప్ర‌కారం కాంగ్రెస్‌ గెలిస్తే, రేవంత్ రెడ్డి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక‌వేళ రేవంత్ సీఎం కాకుండా సీనియర్లు అడ్డుపడితే.. ఆయనకు సన్నిహితురాలైన సీతక్క సీఎం అవ్వొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది. ఆదివాసి, మహిళా కోటాలో సీత‌క్క ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అంచ‌నా.


Latest News
 

బార్ అండ్ పబ్బులలో పోలీసులు అకస్మిక తనిఖీలు Wed, Oct 23, 2024, 12:49 PM
మంత్రి పుట్టినరోజు సందర్భంగా కబడ్డీ పోటీలు Wed, Oct 23, 2024, 12:45 PM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Oct 23, 2024, 12:44 PM
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందజేసిన నాచారం సిఐ Wed, Oct 23, 2024, 12:19 PM
సూర్యలంక పర్యాటక కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన Wed, Oct 23, 2024, 11:51 AM