![]() |
![]() |
byసూర్య | Mon, Nov 20, 2023, 07:09 PM
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. బషీర్‌బాగ్ పాత సీపీ కార్యాలయంలో ఉన్న సమయంలో సందీప్ శాండిల్య ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. ఆఫీసులో ఉండగా.. ఛాతీలో నొప్పి రావటంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో.. ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. సీపీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. అయితే.. 24 గంటల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు.
అయితే.. తన అనారోగ్యం గురించి బయట వస్తున్న వార్తలపై సీపీ సందీప్ శాండిల్య స్పందించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ఆయన వీడియో ద్వారా సందేశమిచ్చారు. తనకు ఉదయం సమయంలో ఛాతిలో నొప్పి రావటంతో కొంచెం ఇబ్బంది పడ్డాడనని.. వెంటనే అపోలో ఆస్పత్రికి వచ్చానని తెలిపారు. తనను పరీక్షించిన వైద్యులు.. స్పాండిలైటిస్‌తో పాటు లో బీపీ ఉందని వెల్లడించినట్టు తెలిపారు. అయితే.. ఇప్పుడు మాత్రం తాను సురక్షితంగానే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఒకరోజు ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు సూచించినట్టు తెలిపారు. మళ్లీ రేపు విధుల్లో చేరుతానని సీపీ సందీప్ శాండిల్యా తెలిపారు.