బీజేపీకీ బిగ్ బూస్ట్... ఆ వర్గం ఓట్లన్నీ కమలానికే.. మోదీ మంత్రం ఫలించినట్టే

byసూర్య | Mon, Nov 20, 2023, 07:14 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ గెలుపు కోసం రకరకాల వ్యూహాలు అమలుచేస్తున్నాయి. మిగతా పార్టీలను కూడా కలుకునిపోతూ.. ఆయా వర్గాల ఓట్లను రాబట్టేలా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే.. కమలం పార్టీకి బిగ్ బూస్ట్ లభించింది. మొన్ననే.. హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ విశ్వరూప మహాసభ నిర్వహించగా.. ఆ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా... ఈ సభలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని ప్రకటించారు. దీంతో.. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలంతా కమలంతో జట్టు కట్టాయి.


ఇదిలా ఉంటే.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కీలక ప్రకటన చేశారు. ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ, ఎమ్మెస్ఎఫ్, ఎంఎంఎస్, వీహెచ్‌పీఎస్, ఎంఈఎఫ్, ఎంజేఎఫ్, ఎంఎల్ఎఫ్, ఎంకేఎం, ఎంవైఎస్‌తో అంటూ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలంతా.. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని మందకృష్ణ ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. అటు కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా మాదిగలను మోసం చేయటమే కాకుండా.. ఉద్యమాన్ని దెబ్బతీయడానికి పలు కుట్రలు కూడా చేశారని ఆరోపించారు మందకృష్ణ. ఈ క్రమంలోనే.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేఫథ్యంలో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం అహర్నిశలు శ్రమించాలని మందకృష్ణ సూచించారు.


దీంతో.. ఎస్సీల మద్దతుతో పాటు ఓట్లు కూడా కాషాయ పార్టీకి పడే అవకాశం ఉంది. మందకృష్ణ మాదిగతో కలిసి నిర్వహించిన సభతో మోదీ రచించిన వ్యూహం ఫలించినట్టుగానే కనిపిస్తోంది. సభలో మందకృష్ణ ఎమోషనల్ కావటం.. ఆయనను గుండెకు హత్తుకుని మరీ ఓదార్చటం లాంటి సన్నివేశాలు.. ఆ వర్గం వారిని ముగ్ధులను చేశాయి. దీంతో.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లు మొత్తం కమలానికి పడేటట్టు కనిపిస్తోంది.


Latest News
 

ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కలిసిన పాలకుర్తి కాంగ్రెస్ నేతలు Sat, Dec 09, 2023, 10:16 AM
ఆలేరు ఎమ్మెల్యేని సన్మానించిన అధికారులు Sat, Dec 09, 2023, 10:07 AM
రహదారుల వెంట వ్యర్థ పదార్థాలు వేయరాదు Sat, Dec 09, 2023, 10:04 AM
నల్ల పోచమ్మకు స్థిర వాసరే ప్రత్యేక పూజలు Sat, Dec 09, 2023, 09:57 AM
రేపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్న కిషన్ రెడ్డి Fri, Dec 08, 2023, 11:03 PM