byసూర్య | Tue, Sep 26, 2023, 03:53 PM
ప్రధాని మోడీ పాలమూరు పర్యటనపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరుకు ఏం చేశారని ప్రధాని మోడీ వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తపోతల ప్రాజెక్ట్ పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ప్రధాని మోడీ ఓట్ల వేట కోసమే మహబూబ్ నగర్ వస్తున్నారని ఆరోపించారు.10 ఏళ్ల నుండి కృష్ణా జలాల్లో వాటా తేల్చడం లేదని.. అది తేల్చాకే మోడీ రావాలన్నారు.