గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై రేపటికి విచారణ వాయిదా
byసూర్య |
Tue, Sep 26, 2023, 04:09 PM
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడింది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.
Latest News