byసూర్య | Tue, Sep 26, 2023, 02:52 PM
ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రం నందు మంగళవారం జీవో 58, 59 ద్వారా ఇళ్ల స్థలాల పట్టాలు, గృహలక్ష్మి మంజూరు ఉత్తర్వు పత్రాల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కేసీఆర్ వచ్చిన తరువాతనే మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ను మరోసారి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.