byసూర్య | Tue, Sep 26, 2023, 02:47 PM
వీరవనిత చాకలి ఐలమ్మ 128 వ జయంతి వేడుకలు చేవెళ్ల మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే యాదయ్య చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం రజాకారులను, భూస్వాములను ఎదురించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు.