byసూర్య | Tue, Sep 26, 2023, 02:41 PM
బంగాళాఖాతంలో అల్పపీడనంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేటతో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.