byసూర్య | Tue, Sep 26, 2023, 01:50 PM
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9: 30 గంటలకు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. 10 గంటలకు భక్త రామదాసు కళాక్షేత్రం, 12: 15 గంటలకు పంపింగ్ వెల్ రోడ్, 12: 30 గంటలకు ఎఫ్సీఐ రోడ్, 12. 45కు వీడియోస్ కాలనీ, 1గంటకు శివాలయం వీధి, 4గంటలకు 2వ డివిజన్, 4: 20కు విజయనగర్ కాలనీలో, 5: 45కు రఘునాథపాలెం మండలం శివాయగూడెంలో నిర్వహించే పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు.