byసూర్య | Tue, Sep 26, 2023, 01:32 PM
కారుకు నిప్పు అంటుకొని దగ్ధమైన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్ తన కారును నిర్మాణంలో ఉన్న ఇంట్లో నిలపగా.. ప్రమాదవశాత్తు కారుకు నిప్పు అంటుకొని దగ్ధమైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.