byసూర్య | Tue, Sep 26, 2023, 01:30 PM
నాగర్కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం గౌరారంకి చెందిన ఇద్దరు బాలికలు ఆగస్టు 20న తప్పిపోగా నేటికీ ఆచూకీ దొరకలేదు. గ్రామానికి చెందిన నాగరాజుకు ఇద్దరూ మైనర్ కూతుర్లు ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయారు. బాలిక మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేశామని అయినా వాళ్ల ఆచూకీ కనుక్కోలేదని నాగరాజు దంపతులు వాపోయారు. ఇన్నిరోజులైనా వాళ్ల జాడ లేదని. తమను పట్టించుకునే వారే లేరని ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు.