సింగరేణి కార్మికుల బకాయిల విడుదల,,,ఒక్కొక్కరికి రూ.లక్షల్లో జమ

byసూర్య | Fri, Sep 22, 2023, 06:07 PM

సింగరేణి కార్మికులకు శుభవార్త. 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు సింగరేణి కార్మికుల ఖాతాల్లో పడ్డాయి. గురువారం సింగరేణి భవన్‌ నుంచి కార్మికుల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో 39 వేల మంది కార్మికుల ఖాతాల్లో రూ.1450 కోట్లను జమచేస్తూ సింగరేణి డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎన్‌. బలరామ్‌ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి బకాయిలు మొత్తం చెల్లించడం తొలిసారి అంటున్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, సీఎంపీఎఫ్‌లో జమచేయాల్సిన సొమ్మును మినహాయించి, మిగిలిన మొత్తం కార్మికుల ఖాతాల్లో జమ చేశారు.


అంతేకాదు త్వరలో దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా కన్నా ముందే చెల్లించడానికి ఏర్పాట్లు చేశామని బలరామ్‌ ప్రకటించారు. దీపావళి బోనస్‌ పీఎల్‌ఆర్‌ను కూడా ముందే చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎరియర్స్‌, బోనస్‌ చెల్లింపు విషయంలో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారని, వీటిని కార్మికులు నమ్మవద్దని కోరారు. ఎవరూ అడగకముందే బకాయిలు, బోనసుల చెల్లింపును సింగరేణితన బాధ్యతగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు.పెద్ద మొత్తంలో ఎరియర్స్ పొందిన కార్మికులు ఈ సొమ్మును పొదుపుగా వాడుకోవాలని, కుటుంబ భవిష్యత్తుకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మిక సంక్షేమానికి సింగరేణి సంస్థ అంకితమై పనిచేస్తుందని ఉద్యోగులు కూడా తమ పని గంటలు సద్వినియోగం చేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఇలాగే మరిన్ని లాభాలు, సంక్షేమం అందుకోవాలని కోరారు.


ఈ వేతన బకాయిలు పొందిన వారిలో సింగరేణి టాపర్‌గా రామగుండం-1 ఏరియా హెడ్‌ ఓవర్‌మెన్‌ వేముల సుదర్శన్‌రెడ్డి రూ. 9.91 లక్షలతో మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రామగుండం-2 ఏరియాకు చెందిన ఈఐపీ ఆపరేటర్‌ మీర్జా ఉస్మాన్‌ బేగ్‌ రూ. 9.35 లక్షలు, మూడోస్థానంలో రూ. 9.16 లక్షలతో శ్రీరాంపూర్‌ ఏరియా హెడ్‌ ఓవర్‌మెన్‌ ఆడెపు రాజమల్లు ఉన్నారు. సింగరేణి భవన్‌లో అత్యధిక బకాయిలను పొందిన లచ్చయ్య (రూ. 6.97 లక్షలు), రవిబాబు (రూ. 6.81 లక్షలు), సత్యనారాయణరెడ్డి (రూ. 6.69 లక్షలు)కి డైరెక్టర్‌ బలరామ్‌, జీఎం సురేష్ చెక్కులను అందించారు. బకాయిలు అందుకోవడంతో పాటుగా దసరా పండుగకు ముందే లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌ను కూడా అందించనున్నారని తెలియజేయడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కో కార్మికుడికి లక్షల్లో డబ్బులు జమ కావడంతో సంతోషంగా ఉన్నామని.. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


Latest News
 

వరి ధాన్యానికి రూ.500 బోనస్.. ఈ రకాలకు మాత్రమే Fri, Oct 18, 2024, 09:59 PM
కోదాడను అగ్రగామిగా తీర్చిదిద్దడమే ఉత్తమ్ దంపతుల లక్ష్యం... Fri, Oct 18, 2024, 09:58 PM
ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం Fri, Oct 18, 2024, 09:53 PM
ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు Fri, Oct 18, 2024, 09:53 PM
ఘనంగా కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ 16వ వర్ధంతి వేడుకలు Fri, Oct 18, 2024, 09:50 PM