ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్లు,,,,త్వరలోనే గ్రేటర్ వ్యాప్తంగా అమలు

byసూర్య | Fri, Oct 18, 2024, 09:53 PM

 ఆర్టీసీ ప్రయాణికులకు చిల్లర కష్టాలు తీరిపోనున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్, ప్రయాణికులకు మధ్య చిల్లర గొడవలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బస్సుల్లో చిల్లర సమస్య లేకుండా పూర్తిస్థాయి డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయింది. ఇందుకు సంబంధించి బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోల్లోని 140 బస్సుల్లో ఇప్పటికే డిజిటల్‌ చెల్లింపుల ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ సేవలకు విశేష స్పందన రావడంతో మరో రెండు నెలల్లో గ్రేటర్‌ పరిధిలోని అన్ని డిపోల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి తీసుకురానున్నారు.


అందుకు అవసరమైన 4,500 ఇంటలిజెంట్‌ టికెటింగ్‌ యంత్రాలను(ఐ టిమ్స్‌)ను ఆర్టీసీ యాజమాన్యం సిద్ధం చేస్తోంది. ఇంటర్నెట్‌ ఆధారంగా ఈ యంత్రాలు పని చేయనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 10 వేల ఐటిమ్స్‌ యంత్రాలు అవసరమవుతాయని అధికారులు భావిస్తుండగా.. అందులో సగం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వినియోగించనున్నారు. ప్రయాణికులు గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్‌తో టికెట్ కొనే వెసులుబాటు కలిగించనున్నారు.


ప్రస్తుతం సూపర్ లగ్జరీ, దూర ప్రాంతాలకు వెళ్లే నాన్‌స్టాప్ సర్వీసుల్లో ఈ డిజిటల్ చెల్లింపుల టికెటింగ్ విధానాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ సిటీ బస్సుల్లోనూ ప్రయోగత్మాకంగా డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించగా.. పూర్తి స్థాయిలో అన్ని బస్సుల్లోనూ చెల్లింపులు డిజిటల్ చేయాలని తాజాగా ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. యూపీఐ, క్రెడిట్, డెబిట్‌ కార్డు ద్వారా టికెట్ ధర చెల్లింపులు ప్రారంభమైతే ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లర కష్టాలు తీరిపోనున్నాయి.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM