ప్రపంచ హస్ పైస్,పాలియేటివ్ కేర్ దినోత్సవం

byసూర్య | Fri, Oct 18, 2024, 09:53 PM

స్థానిక పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి యందు పాలియేటివ్ కేర్ కేంద్రం లో ప్రపంచ హస్ పైస్, పాలియేటివ్ కేర్ దినోత్సవం నిర్వహించడం జరిగినది. అని డాక్టర్ కె. ప్రమోద్ కుమార్,  జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసే కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగినది అని అన్నారు. ఈ సంవత్సరం థీమ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కార్యక్రమము పై తీర్మానం చేసి పది సంవత్సరములు పూర్తి అయిన సందర్బంగా ఈ సంవత్సరం థీమ్ – టెన్ ఇయర్స్ సిన్స్ ద రెజెల్యూషన్ :హౌ ఆర్ వుయ్ డూయింగ్ గా నిర్ణయించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హస్ పైస్ మరియు పాలియేటివ్ కేర్ అనగా అవసాన దశ రోగుల నిలయము మరియు ఉపశమన సేవలు అని అన్నారు.
ఈ కార్యక్రమములో చికిత్స లేని రోగాలకు మరియు జీవిత చరమాంకంలో ఉన్న బాదితులకు, రోగ లక్షణాలకు చికిత్స అందించి ఉపశమనం కలిగించుట మరియు వారి బాధలను తగ్గించుట, చివరి దశలో ఆలన, ఆధరణ మరియు సేవలను అందించి మానసిక ఉల్లాసాన్ని కల్గించడం ఆ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. ఈసందర్బంగా పాలియేటివ్ కేర్ లో పనిచేయుచున్న డాక్టర్స్ ను మరియు సిబ్బందికి అవసాన దశ రోగులను అతిథులు గా భావించి సేవలు అందించాలని వారితో అప్యాయంగా మాట్లాడాలని తగిన చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమములో డా. ఆర్. రాజమౌళి, ప్రోగ్రామ్ అధికారి (ఎన్.సి.డి), డా. రవిందర్, ఆర్.ఎమ్.ఒ.,డా. రవిసింగ్, డిప్యూటి డిఎమ్ హెచ్ ఒ,, డా. కె.వి. సుధాకర్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారి (ఎన్.టి.ఇ.పి), డా. బి. శ్రీరాములు, డిప్యూటి డిఎమ్ హెచ్ ఒ., డా. హరికిషన్ సింగ్, పాలియేటివ్ కేర్ వైద్యాదికారి, శ్రీ యస్. వెంకటేశ్వర్లు, డిప్యూటి డెమో, శ్రీ ఎ. మధుసూదన్, జిల్లా ఎన్.సి.డి  ప్రోగ్రామ్ కోఆర్టినేటర్, పాలియేటివే కేర్ సిబ్బంది పాల్గోన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM