కోదాడను అగ్రగామిగా తీర్చిదిద్దడమే ఉత్తమ్ దంపతుల లక్ష్యం...

byసూర్య | Fri, Oct 18, 2024, 09:58 PM

గ్రామీణ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణానికి ఉత్తం దంపతులు శ్రీకారం చుట్టారని తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నూతన రహదారుల నిర్మాణానికి మరమ్మత్తులకు కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు అభినందిస్తూ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కోదాడ ధ్వంసం అయిందని అవినీతి కబ్జాలతో ప్రజలను పీడిచుకుని తిన్నారని తెలిపారు.
అభివృద్ధి చేయకుండా అడ్డగోలుగా అక్రమంగా సంపాదించాలని గత టీఆర్ఎస్ నేతలను దుయ్యబట్టారు. పద్మావతి రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి కోదాడ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎక్కడ అభివృద్ధి ఆగలేదని వారు గుర్తు చేశారు. రాజకీయాలకు తావు లేకుండా విమర్శలకు పోకుండా వారు తమ అభివృద్ధి పనితోటే సమాధానం చెబుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ తమ మనుగడ కోసమే లేనిపోని ఆరోపణలను చేస్తున్నారని అభివృద్ధి పై చర్చకు వచ్చే దమ్ము వారికి లేదని విమర్శించారు. మాటలతో కాదు పని తోటే సమాధానం చెప్పే నైజం ఉత్తం దంపతులదని , వీరు ఇరువురు ప్రజాక్షేత్రంలో ఉండడం మనకు ప్రాతినిధ్యం వహించడం నిజంగా నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వారి సారథంలో కోదాడ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM