వరి ధాన్యానికి రూ.500 బోనస్.. ఈ రకాలకు మాత్రమే

byసూర్య | Fri, Oct 18, 2024, 09:59 PM

తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేశారు. మెుత్తం 3 విడతల్లో రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేయగా.. మరో రూ.13 వేల కోట్ల మాఫీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎకరాకు రూ.15 వేలు ఖరీఫ్, రబీ సీజన్లలో రూ. 7,500 చొప్పున ఇవ్వనుండగా.. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు అవుతున్నాయి.


ఇక ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన ప్రధాన హమీల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ కూడా ఒకటి. సన్న వడ్లకు రూ.500 బోనస్ వర్తింపజేస్తామని.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ పెద్దలు పలుమార్లు వెల్లడించారు. అయితే ఏ రకం ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తారనే విషయంపై రైతుల్లో సందేహాలు నెలకొన్నాయి. ప్రతి క్వింటాల్‌ ధాన్యానికి రూ. 500 బోనస్‌ చెల్లిస్తామని చెప్పగా.. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించారు.


బోనస్‌ ఇవ్వడానికి తాజాగా రేవంత్ సర్కార్ మార్గదర్శకాలు జారీ చేసింది. వరి ధాన్యం సన్నాల్లోని 33 రకాలకు రూ. 500 బోనస్ వర్తింపజేశారు. వరి ధాన్యం గింజ పొడువు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అనేది తెలుసుకోనున్నారు. అందుకోసం ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద మైక్రో మీటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గింజ పొడవు 6 మిల్లీ మీటర్ల కంటే తక్కువ వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకుండా ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ధాన్యం తేమ 17 శాతానికి మించనప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ వర్తింపజేయనున్నారు.


రూ.500 బోనస్ వర్తించే రకాలు


వరంగల్‌ సాంబ(డబ్ల్యుజీఎల్‌ 14)


వరంగల్‌ సన్నాలు (డబ్ల్యుజీఎల్‌32100)


జగిత్యాల్‌ మసూరి (జేజీఎల్‌11470)


సిద్ధి(డబ్ల్యుజీఎల్‌44)


కంపసాగర్‌ వరి-1 (కేపీఎస్‌ 2874)


సాంబ మసూరి ( బీపీటీ 5204)


జగిత్యాల్‌ వరి- 3(జేజీఎల్‌ 27356)


జగిత్యాల్‌ వరి- 2(జేజీఎల్‌ 28545)


పొలాస ప్రభ (జేజీఎల్‌ 384)


వరంగల్‌ వరి- 2 (డబ్ల్యుజీఎల్‌ 962)


ఎంటీయూ 1271


రాజేంద్రనగర్‌ వరి - 4 (ఆర్‌ఎన్‌ఆర్‌ 21278)


కూనరం వరి- 1 (కేఎన్‌ఎం 733)


జగిత్యాల సన్నాలు (జేజీఎల్‌ 1798)


కృష్ణ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2458)


మానేరు సోనా (జేజీల్‌ 3828)


తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)


వరంగల్‌ వరి - 1119


కూనరం వరి- 2 (కేఎన్‌ఎం 1638


జగిత్యాల సాంబ (జేజీఎల్‌ 3844)


కరీంనగర్‌ సాంబ (జేజీఎల్‌ 3855)


అంజన (జేజీఎల్‌ 11118)


సోమ్‌నాథ్‌ (డబ్ల్యుజీఎల్‌ 347)


ఆన్‌ఆర్‌ఆర్‌ 31479(పీఆర్సీ)


కేపీఎస్‌ 6251 (పీఆర్సీ)


జేజీఎల్‌ 33124 (పీఆర్సీ)


నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్‌ 34449)


ప్రత్యుమ్న (జేజీఎల్‌ 17004)


సుగంధ సాంబ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2465)


శోభిని (ఆర్‌ఎన్‌ఆర్‌ 2354)


హెచ్‌ఎంటీ సోనా


మార్టేరు మసూరి (ఎంటీయూ 1262)


మార్టేరు సాంబ (ఎంటీయూ 1224)


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM