హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలో కుండపోత.. ఎల్లో అలర్ట్ జారీ

byసూర్య | Fri, Sep 22, 2023, 06:58 PM

నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కాగా.. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో.. తెలంగాణవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటుగా 15 జిల్లాలకు వాతావరణ శాఖ అదికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.


రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో.. 16 జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల హెచ్చరికల నేపధ్యంలో జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో అధికాలు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM