byసూర్య | Wed, Sep 20, 2023, 01:21 PM
ఖమ్మం నగరంలోని ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆటో అడ్డాలకు ఆటోస్టాండ్ కేటాయించాలని కోరుతూ ట్రాఫిక్ సీఐ అశోక్ కు తెలంగాణ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై. విక్రమ్, నాయకుడు జిల్లా ఉపేందర్ మాట్లాడుతూ. మయూరిసెంటర్ నుంచి ప్రజలకు సానుకూల మార్గం కావడంతో మయూరిసెంటర్లో ఆటోస్టాండు ఏర్పాటు చేయాలన్నారు.