byసూర్య | Wed, Sep 20, 2023, 01:21 PM
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి వారిని వెంటనే పర్మినెంట్ చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ డిమాండ్ చేశారు. ఖమ్మం అర్బన్ తాహసీల్ ఎదుట అంగన్వాడీలు చేపట్టిన నిరసన సమ్మెను సంఘీభావం ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐతో పాటు పెన్షన్ సదుపాయం కల్పించాలని, రిటైర్మెంట్ టీచర్లకు రూ. 10లక్షలు, ప్రమాద బీమా రూ. ఐదు లక్షలు చెల్లించాలని కోరారు.