byసూర్య | Wed, Sep 20, 2023, 01:22 PM
పాలేరు నియోజకవర్గం పరిధిలోని డబుల్ ఓటర్ల జాబితాపై నిగ్గు తేల్చాలని కోరుతూ ఖమ్మం రూరల్ తహసీల్దార్ బీ. వీ. రామకృష్టకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా 1, 500కు పైగా ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు పోలింగ్ బూత్ లో నమోదైనట్లు తాము గుర్తించామని, కొంతమంది ఓటర్ల పేర్లు ఇతర నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ లో నమోదై ఉన్నాయని తెలిపారు.