byసూర్య | Wed, Sep 20, 2023, 01:22 PM
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఓటర్లను డబ్బుతో కొనొచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని.. కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకుని కారు గుర్తుకే ఓటేయాలన్నారు. దశాబ్దాలపాటు హింసించిన వాళ్లు కొత్త కొత్త వేషాలు వేసుకుని వస్తున్నారని వాళ్ల మాటలు నమ్మవద్దని అన్నారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన సందర్బంగా తెలంగాణ భవన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.