byసూర్య | Wed, Sep 20, 2023, 01:23 PM
కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన గాండ్ల మల్లేష్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మల్లేష్ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ లోని గాజులరామారం మహదేవపురంలోని తత్వ ఎవెన్యూ అపార్ట్‌మెంట్‌లో కాపలాదారుగా పనిచేస్తున్నాడు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం ఉదయం అపార్టుమెంటు ప్రహరీపైకి ఎక్కి మామిడి తోరణాలు కడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.