ఓయూ విద్యార్థుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి

byసూర్య | Sat, Jan 28, 2023, 01:18 PM

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పి డి ఎస్ యూ ఉస్మానియా యూనివర్సిటీ నేతలు ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ రూపొందించారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థుల సమావేశం నిర్వహించి ఓయూ స్టూడెంట్స్ ఎజెండా రూపొందించి, అనంతరం ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ప్రెస్ మీట్ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఓయూ నేతలు ఎస్. నాగేశ్వర రావు (రీసెర్చ్ స్కాలర్) ఎన్. సుమంత్, కె. స్వాతి మాట్లాడుతూ, ఎనిమిదిన్నారెళ్ళ తెలంగాణ రాష్ట్ర పాలనలో ఓయూ విద్యార్థుల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర రాజధాని లోని ప్రభుత్వ యూనివర్సిటీ ఉస్మానియా ఫీజుల వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా మారి పేద, మధ్యతరగతి విద్యార్థులకు తీవ్ర మనోవేదనకు కలిగిస్తున్నదనీ అన్నారు.


ఓయూ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మెస్ డిపాజిట్ల పేరుతో వేలకు వేల రూపాయల ఫీజులు దండుకుంటున్నా ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ సాధిస్తే ఉస్మానియా యూనివర్సిటీ నీ అంతర్జాతీయ స్థాయిలో అభివృధ్ధి చేస్తామనే మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధీనంలో నిర్వహించే వివిధ శాఖల పరిధిలో నిర్వహించే వసతి గృహాలలో ఉచిత మెస్ వసతి కల్పించిన ప్రభుత్వం, ఓయూ విద్యార్థులకు మాత్రం మెస్ కొనుకున్నే దుస్థితి ఎందుకు కొనసాగిస్తుందో తెలపాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన ఉస్మానియా విద్యార్థుల రుణం తీర్చుకునే బాధ్యత ఇప్పటికైన ప్రభుత్వ స్వీకరించాలని అన్నారు.


యూనివర్సిటీల ఉచిత మెస్ వసతి కల్పించి, మెస్ డిపాజిట్ల పద్దతినీ రద్దు చేయాలని అన్నారు. ఓయూ విద్యార్థుల స్కాలర్షిప్ ను రు. 1500 నుండి రు. 3000లకు పెంచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఓయూ విద్యార్థులకి ఫెలోషిప్ ( పీజీ. రు. 3000, పరిశోధన రు. 10, 000) ఇవ్వాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ను దృష్టి లో పెట్టుకొని ఓయూ విద్యార్థులకు ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టాలని అన్నారు. ఓయూ అభివృధి కోసం రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి డిమాండ్ చేశారు. ఓయూలోనీ అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేసి, ప్రస్తుత ఫీజులకు ప్రభుత్వం పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని అన్నారు. ఓయులో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి కోరారు.


Latest News
 

బావిలో పడి వలస కూలీ మృతి Mon, Apr 29, 2024, 01:43 PM
వంశీకృష్ణని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే Mon, Apr 29, 2024, 01:41 PM
లోక్ సభ బరిలో ఇద్దరు వారసులు Mon, Apr 29, 2024, 01:37 PM
ఇంటింటికి బిజెపి అభివృద్ధి కరపత్రాలు పంపిణీ Mon, Apr 29, 2024, 01:35 PM
కాంగ్రెస్ గెలుపు కోసం ప్రచారం Mon, Apr 29, 2024, 01:32 PM