క్రీడా మైదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

byసూర్య | Sat, Jan 28, 2023, 01:20 PM

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పట్టణాలకు, గ్రామాలకు ఆట స్థలాన్ని ఏర్పాటు చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం పిఏపల్లి మండలం బాలాజీ నగర్ గ్రామంలో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాన్ని ప్రారంభించి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రౌండ్‌లో రకాల క్రీడలకు కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. క్రీడల వలన శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రజలందరూ ఈ క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ వేలుగురి వల్లపు రెడ్డి, అర్వపల్లి నర్సింహా, తోటకురి పరమేష్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మెగావత్ బన్సీలాల్, స్థానిక సర్పంచ్ పార్వతివెంకన్న నాయక్, యసాని రాజవర్ధన్ రెడ్డి, లచ్చి రెడ్డి, బోడ్డుపల్లి మహేందర్, బోడ్డుపల్లి కృష్ణ, కర్నాటి రవి, సంఘా నాయక్, పేర్వాల రంగ రెడ్డి, మద్దిమడుగు కర్ణయ్య, ఏపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేషన్‌ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన Wed, May 15, 2024, 07:53 PM
పెద్ద మనసు చాటుకున్న పోలీసులు.. హ్యాట్సాప్ అంటున్న నెటిజన్లు Wed, May 15, 2024, 07:48 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లోనే, ఎల్లో అలర్ట్ జారీ Wed, May 15, 2024, 07:44 PM
హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి Wed, May 15, 2024, 07:40 PM
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా ?.. సీఎం రేవంత్ ఏమన్నారంటే Wed, May 15, 2024, 07:36 PM