ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా వేయించాలి

byసూర్య | Sat, Nov 26, 2022, 02:07 PM

గర్భిణీ స్త్రీలు శిశువులు వ్యాధినిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ తెలిపారు. రాజోలి మండల కేంద్రము లోని రాజోలి ఏ ఆరోగ్య కేంద్రం ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గర్భిణీ స్త్రీలకు శిశువులకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి అని ఆయన అన్నారు. ఒక రోజు ముందుగానే ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి గర్భిణీ స్త్రీలు, శిశువుల వివరాలు నమోదు చేసి ఎంత మంది మహిళలు పిల్లలు ఉన్నారో వారందరినీ టీకా సెంటర్ కు తరలించి టీకా ఇప్పించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు పై వారికి అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలు కాన్పు ఇంటి దగ్గర కాకుండా రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు కావాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లో కాన్పు అయిన వారికీ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము కే సీ ఆర్ కిట్ తో పాటుగా ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎమ్ మద్దమ్మ, ఆశా వర్కర్లు సరస్వతి, విజయ లక్ష్మి, మంజుల అనిత తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Wed, May 08, 2024, 09:14 PM
హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి Wed, May 08, 2024, 09:09 PM
ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ Wed, May 08, 2024, 09:04 PM
ఆడపిల్ల పుడితే రూ.2 వేల డిపాజిట్‌.. ఈ దంపతులది ఎంత గొప్ప మనసు Wed, May 08, 2024, 08:59 PM