హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. గోడకూలి ఏడుగురు మృతి

byసూర్య | Wed, May 08, 2024, 09:09 PM

హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగర జీవనం అస్తవ్యస్తం అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్‌లో 13.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పండింది. కి.మీ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. పలు చోట్ల చెట్లు కూలటంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.


ఇక గాలివాన కారణంగా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుక ఎల్లమ్మ కాలనీ విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న గోడకూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సెంట్రింగ్ కార్మికుల తాత్కాలికంగా వేసుకున్న షెడ్‌పై నిర్మాణంలో ఉన్న గోడ కూలటంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది జేసీబీల సాయంతో 7 మృతదేహాలను బయటకు తీశారు. మృతులను రాజు (25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషి, తిరుపతిరావు (20), శంకర్‌ (22)గా గుర్తించారు.


మృతిచెందిన కార్మికులు కార్మికులు ఒడిషా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. రైజ్ డెవెలపర్స్ కన్స్ట్రక్షన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి ఏసీపీ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM