అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు

byసూర్య | Sun, May 19, 2024, 07:41 PM

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సత్యం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన పత్రాన్ని గత నెల 24వ తేదీన కలెక్టర్‌కు అందించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ముగిసిన తర్వాత అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో శనివారం ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మున్సిపల్ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 11 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో ప్రకటించారు. అవిశ్వాసం నెగ్గడంతో సత్యం పదవిని కోల్పోయారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 14వ తేదీన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM