నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు,,,ఉప్పల్ లో సన్ రైజర్స్ మ్యాచ్

byసూర్య | Sun, May 19, 2024, 07:34 PM

హైదరాబాద్ నగరంలో ఉప్పల్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  దీనిపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వివరాలు తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. హెచ్ఎండీఏ లే అవుట్ నుంచి బోడుప్పల్, చెంగిచెర్ల క్రాస్ రోడ్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను భగాయత్ రోడ్డుపై మళ్లిస్తారు. వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


Latest News
 

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపిందన్న కేకే Sun, Mar 23, 2025, 08:52 PM
రేషన్ కార్డు దారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్ Sun, Mar 23, 2025, 08:11 PM
రైతులకు స్పింక్లర్లను అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ Sun, Mar 23, 2025, 08:07 PM
ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేత వేములవాడ Sun, Mar 23, 2025, 07:49 PM
కామారెడ్డి సీనియర్ రొటోరియన్లకు అవార్డుల ప్రధానం Sun, Mar 23, 2025, 07:47 PM