ఓటేసేందుకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ

byసూర్య | Wed, May 08, 2024, 09:04 PM

ఈనెల 13న తెలంగాణలో పార్లమెంట్ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన చాలా మంది ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే ట్రైన్లలో దాదాపు‌గా ముందుస్తు రిజర్వేషన్లు చేసుకున్నారు. అందువల్ల ట్రైన్ టికెట్లు దొరకటం లేదు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో TSRTC గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలో ఓటున్న నగరవాసులు వెళ్లేందుకు సరిపడా బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని, శని, ఆదివారాల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రెండు రోజులు సెలవుదినాలు కావడంతో సిటీ బస్సులను దూర ప్రాంతాలకు వెళ్లేలా సర్దుబాటు చేస్తున్నారు. తెలంగాణలో పల్లెల్లో ఓట్లున్న వారు ఎన్నికల రోజు అక్కడికి వెళ్లేందుకు తెల్లవారుజాము నుంచి.. తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.


ఏపీ, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు కలిపి రోజువారీ బస్సులకు అదనంగా 2 వేల వరకూ నడుపుతున్నారు. టీఎస్‌ఆర్టీసీతోపాటు ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుంది. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులకు అదనంగా వెయ్యికిపైగా బస్సులను సిద్ధంగా ఉంచుతోంది. 200 బస్సుల్లో రిజర్వేషన్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM