హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా

byసూర్య | Sun, May 19, 2024, 07:51 PM

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి. బయటేమో పెద్ద పెద్ద బోర్డులు, చమ్కయించే లైట్లు, లోపలోమో అదిరిపోయే యాంబియెన్స్‌‌, వెరైటీ వంటకాల లిస్టుతో కస్టమర్లను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాయి హోటళ్లు, రెస్టారెంట్లు.. కానీ అందులోని కిచెన్ల పరిస్థితి చూస్తే అసలు ముచ్చట అర్థమవుతుంది. కస్టమర్లు కిచెన్‌కు రారు కాబట్టి.. ఎలా చేసినా, ఎలాంటి పదార్థాలు వాడినా వాళ్లకేం తెలుస్తుందిలే అన్న దీమానో.. లేదా కాసులు మిగిలించుకునే కక్కర్తో కానీ.. కావాల్సినంత దరిద్రం ఆ కిచెన్‌లోనే ఉంటుందన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.


ముఖ్యంగా హైదరాబాద్‌లో చాలా మంది.. రెస్టారెంట్లు, హోటళ్లు అంటూ బయటి ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇక వీకెండ్ వస్తే చాలు.. ఇంట్లో వంటకు సెలవు ఇచ్చేసి రెస్టారెంట్లు, హోటళ్ల బాట పడతారు. అయితే.. పరిశుభ్రత, నాణ్యత విషయంలో ఇప్పటికే చాలా మంది అప్రమత్తం కావటంతో.. స్ట్రీట్ ఫుడ్ కానీ, చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్ల జోలికి వెళ్లకుండా.. ఫేమస్ రెస్టారెంట్లకే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే అందులో అయితే శుభ్రతతో పాటు నాణ్యత ప్రమాణాలు కూడా పాటిస్తారాని. కానీ.. శనివారం రోజున ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనీఖీల్లో అసలు విషయం బయటపడింది. ఫేమస్ రెస్టారెంట్లలోని కిచెన్‌లలో కూడా కావాల్సినంత దరిద్రం ఉందని తెలిసిపోయింది.


ఇప్పటికే పలుమార్లు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టగా.. అనేక హోటళ్ల అసలు బండారం బయటకు వచ్చింది. ఇప్పుడు మరికొన్ని ఫేమస్ రెస్టారెంట్ల నిర్వాకం వెలుగు చూసింది. శనివారం సాయంత్రం లక్డీకాపూల్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫేమస్ అయిన 'రాయలసీమ రుచులు' హోటల్‌లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. వంటలో వినియోగించే మైదాలో పురుగులు తిరగడాన్ని గుర్తించారు. అలాగే చింతపండులో పురుగులు తిరుగుతున్నాయి. అలాగే డేట్ దాటిపోయిన అమూల్ పాలను కూడా వంటకాలను వినియోగిస్తున్నట్లు నిర్ధారించారు. అలా గుర్తించిన 20 కిలోల మైదా, 2 కిలోల చింతపండును సీజ్ చేశారు. అలాగే హోటల్‌లో గడువు ముగిసిన అమూల్ గోల్డ్ పాలను, తయారీ లైసెన్స్‌ లేని రూ.16 వేలు విలువైన గోలీసోడా (168 బాటిళ్లు) స్వాధీనం చేసుకున్నారు. లేబుల్ లేని జీడిపప్పు, జవారీ రోటీలను గుర్తించిన అధికారులు తొలగించారు.


అలాగే.. అదే ప్రాంతంలో ఉన్న షాగౌస్ హోటల్‌లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో కూడా లేబుల్ చేయని సెమీ సిద్ధమైన వస్తువులు నిల్వలో ఉన్నట్టు గుర్తించారు. ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ రికార్డులు కూడా అందుబాటులో లేవు. కిచెన్‌లో పూర్తిగా అపరిశుభ్రమైన వాతావరణం ఉండటాన్ని గమనించారు. ఫేమస్ కేఫెసీ రెస్టారెంట్‌లోనూ అధికారులు తనిఖీలు చేయగా.. అందులో కూడా మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు సరిగ్గా లేవని గుర్తించారు.



Latest News
 

తెలంగాణకు కొత్త సీఎం వస్తారని ఇటీవల వ్యాఖ్యానించిన ఏలేటి Sun, Nov 03, 2024, 09:43 PM
తెలంగాణ వెదర్ రిపోర్ట్.. వర్షాలపై వాతావరణశాఖ అప్డేట్ Sun, Nov 03, 2024, 09:42 PM
తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు.. వర్సిటీ వీసీల సమావేశంలో సీఎం రేవంత్ Sun, Nov 03, 2024, 09:40 PM
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు డేట్ ఫిక్స్.. తొలి దశలో వారికి మాత్రమే, ఇంటి డిజైన్‌పై కీలక నిర్ణయం Sun, Nov 03, 2024, 09:38 PM
వారికి 'కల్యాణ కానుక'గా రూ.50 వేలు.. ప్రతి నెలా రూ.9 వేలు అకౌంట్లలో జమ Sun, Nov 03, 2024, 09:36 PM