రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త

byసూర్య | Wed, May 08, 2024, 10:15 PM

ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా.. రైతుబంధు, రైతు రుణమాఫీ అంటూ అన్నదాతల చుట్టే నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఇదే విషయాలపై విమర్శలు, ఆరోపణలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. మే 9వ తేదీలోపు అన్నదాతలందరి అకౌంట్లలో రైతుబంధు డబ్బులు జమ చేస్తామంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు.. 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న అన్నదాతలకు పెట్టుబడి సాయం అదించేందుకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటించింది కూడా. కానీ.. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పరిగణించి.. మే 13న పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. రైతుబంధుకు బ్రేక్ పడింది.


ఈ అయోమయ పరిస్థితిని ఆసరాగా చేసుకుని.. కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపారు. రైతులనే టార్గెట్‌గా చేసుకుని రైతుబంధుతో పాటు పీఎం కిసాన్ కింద డబ్బులు పడ్డాయంటూ నిలువునా దోచేస్తున్నారు. రైతుల నెంబర్లకు.. మీ అకౌంట్లలో రైతుబంధు డబ్బులో లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కిందో పైసలు పడ్డాయంటూ.. సాధారణ మెస్సేజ్ గానీ, వాట్సప్ మెస్సేజ్ గానీ పంపిస్తారు. ఆ మెస్సేజ్ ఏంటా అని ఓపెన్ చేస్తే.. అందులో మీ అకౌంట్‌లో ఆ పథకానికి సంబంధించిన డబ్బు పంపించామని.. జమ అయ్యిందా లేదా అని చెక్ చేసుకునేందుకు కింద ఇస్తున్న లింకును క్లిక్ చేయాలని ఉంటుంది. పొరపాటున కానీ ఆ లింక్ క్లిక్ చేశామో.. ఇక అంతే సంగతులు. ఆ లింక్ క్లిక్ చేస్తే.. అకౌంట్‌లో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును సైలెంట్‌గా పూర్తిగా ఖాళీ చేసేస్తారు.


అయితే.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో స్కామర్లు.. ఇలాంటి మెస్సేజులను చాలా మంది రైతులకు పంపిస్తున్నారు. ఒకవేళ మీద మొబైల్స్‌కు ఇలాంటి మెస్సేజులు వస్తే మాత్రం ఆ లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ఈ విషయం తెలియక.. ఇప్పటికే ఆ లింకును క్లిక్ చేసిన చాలా మంది రైతుల అకౌంట్లలో నుంచి డబ్బులు పోయినట్టు తెలుస్తోంది. ఇలాంటి అనుమానాస్పద మెస్సేజులు వస్తే.. అధికారులకు గానీ, పోలీసులకు గానీ వెంటనే సమాచారం ఇవ్వండి.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM