మీ శరీర బరువుని బట్టి ఎంత నీరు తాగొచ్చు..

byసూర్య | Tue, Oct 26, 2021, 12:32 PM

శరీరానికి నీరు అనేది చాలా అవసరం. 2 రోజులు ఆహారం లేకుండా ఉండగలం కానీ నీరు లేకుండా మాత్రం ఒక్క పూట ఉండడమే గగనం. ఎందుకంటే శరీరంలో తగినంత నీరు లేకపోతే అలసటగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా మణికట్టుపై చర్మాన్ని ఒక్కసారి పైకిలాగి వదిలితే అది వెంటనే యథాస్థితికి వస్తే శరీరంలో తగినంత నీరు ఉన్నట్లు లెక్క. అలాకాకుండా ముడతలు పడుతూ వెంటనే పూర్వస్థితికి రాలేకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లు అర్థం చేసుకుని కనీసం గ్లాస్ వాటర్‌ను తాగాలి. డీహైడ్రేషన్‌కు గురైతే వీలైనంత వరకు నీడలో ఉండేలా జాగ్రత్త పడాలి. డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి.


చర్మం, కళ్లు పొడిబారిపోతాయి. చిరాకుగా ఉంటుంది. మూత్రం తక్కువగా వస్తుంది. మైకం ఆవహించి కండరాలు నొప్పిస్తాయి.కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తి రోజుకు 8 గ్లాసుల మంచినీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరు వైద్యులు అయితే తప్పనిసరిగా రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలని చెప్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ముందు ఎక్కువ మోతాదులో, మధ్యాహ్నం తిన్న తర్వాత తక్కువ మోతాదు నీరు తాగాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.ఉదయాన్నే లేచిన వెంటనే 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు తాగితే మంచిదట. ఇలా చేయడం వల్ల శరీరంలోని అవయవాలు ఉత్తేజం చెందుతాయట. అంతేకాకుండా శరీరం నుంచి విషపదార్థాలను తొలగించడంలో మంచినీరు సహాయపడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్నానం చేయడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.


 


అంతేకాకుండా నిద్రించే ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల శరీరంలో ద్రవనష్టం నివారింపబడి గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నీటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. శరీర బరువును బట్టి మీరు నీరు తాగాల్సి ఉంటుంది.ప్రతి వ్యక్తి 20 కిలోల బరువును బట్టి ఒక లీటరు నీటిని తాగాలని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఉదాహరణకు మీరు 70 కిలోల శరీర బరువు ఉంటే, అప్పుడు 20 కిలోలకు లీటర్ చొప్పున 3.5 లీటర్ల నీరు తాగాలి. 80 కిలోలు ఉంటే, 4 లీటర్ల నీరు తాగాలి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం, ఒక మహిళ ప్రతిరోజూ 11.5 కప్పుల నీరు తాగాలి. అంటే 2.7 లీటర్లు. అదే సమయంలో, పురుషుడికి 15.5 కప్పుల నీరు అవసరం, అంటే ప్రతిరోజూ 3.7 లీటర్లు తాగాలి. పైన పేర్కొన్న విధంగా ప్రతీ రోజూ ఇంత మోతాదులో నీరు అవసరం అని ధ్రువీకరించలేం.ఆహారం, జీవనశైలి, వాతావరణ మార్పులపై వాటర్ మోతాదు ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ తాగే నీళ్ల పరిమాణం.. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఏ ఉష్ణోగ్రతలో ఉంటున్నారు, ఏ వాతావరణంలో జీవిస్తున్నారు, ఎంత చురుకుగా ఉన్నారు, మీ ఆరోగ్యం, గర్భధారణ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి శరీరంలో 65 శాతం వరకు నీరు ఉంటుంది.


 


శరీర బరువులో సగం నీరు శాతం అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 కిలోల బరువు ఉంటే అందులో 65 కిలోలు నీరు ఉందని అర్ధం చేసుకోవాలి. అయితే వయస్సు రీత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులు ఉంటాయి. పెద్దల గురించి మాట్లాడితే..వారి శరీరంలో 65 శాతం నీరు ఉంటుంది. అలాగే వృద్ధులలో 50 శాతం, పిల్లలలో 80 శాతం ఉంటుంది. ఈ నీరు శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇది అనేక వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది.అయితే అతిగా నీరు తాగడం వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశముంది. అతిగా మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అటు గుండె, మూత్రపిండాలు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.శరీరంలో తేమ శాతం పెరుగుతుంది. అంతేకాదు రక్తం పెరగడం కారణంగా రక్తనాళాలు, గుండెపై అదనపు భారం పడుతుంది. తద్వారా గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది.


 


శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలు కూడా మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం స్థాయి తగ్గి మరణానికి దారి తీస్తుంది. అతిగా నీరు తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.


Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM