వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం

byసూర్య | Tue, Oct 26, 2021, 01:11 PM

దుగ్గొండి మండలం చాపలబండలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. చాపలబండలో ఇప్పటి వరకు నాలుగు గొర్రెలు మృతి చెందాయి. వ్యాధి లక్షణాలున్న గొర్రెలను ఊరికి దూరంగా ఉంచాలని యజమానులను అధికారులు ఆదేశించారు.ఈ సందర్భంగా వెటర్నరీ అధికారులు మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా గొర్రెలకు టీకాలు ఇస్తున్నామని తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు స్పష్టం చేశారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM