ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత

byసూర్య | Thu, Apr 25, 2024, 07:56 PM

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు తోడు తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం చుక్కలు చూపిస్తుంది. చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఎండ తాపాన్ని తట్టుకోలేక ప్రజలు చల్లటి పదార్థాలు తాగేందుకు మెుగ్గు చూపుతున్నారు.


 నిన్నమొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు కురిసి కాస్త చల్లబడ్డా.. ఇప్పట్లో ఇక వర్షాలు లేనట్టే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు అంతేకాదండోయ్ నేటి నుంచి ఎండలు భారీగా పెరిగిపోయే సూచన ఉందని అంటున్నారు. నేటి నుంచి రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సీయస్ నుంచి 45 డిగ్రీల వరకు పెరిగే సూచన ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో వారం రోజుల తర్వాత ఎండలు మరింత ముదిరిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే నెల ప్రారంభం నుంచి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని అన్నారు.


ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అంటున్నారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ లేదా గొడుగు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో చల్లని ప్రాంతాల్లో ఉండాలని.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఎక్కువగా నీరు తాగటంతో పాటు మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగాలని సూచిస్తున్నారు.



Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM