రూపాయితో రీఛార్జి అన్ని చెప్పి రూ. 11లక్షలు కొట్టేశారు

byసూర్య | Tue, Oct 26, 2021, 10:57 AM

రూపాయితో రీఛార్జి చేసుకోవాలని. లేకపోతే చరవాణి పని చేయదని చెప్పి రూ. 11 లక్షలు కాజేశారంటూ ఓ వయోవృద్దుడు సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై లచ్చిరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం. నగరానికి చెందిన ఓ వృద్ధుడు(70)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఓ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కొన్ని గంటల్లో మీ సిమ్‌కార్డు సేవలు రద్దవుతాయని, వెంటనే రూపాయితో రీఛార్జి చేసుకోవాలని సూచించాడు. ఓ లింక్‌ పంపి వివరాలు పొందుపర్చాలన్నాడు. లింక్‌పై క్లిక్‌ చేసి, వివరాలన్నీ పొందుపరచగానే నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వృద్ధుడి ఖాతాలోంచి విడతల వారీగా రూ. 11 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. నిస్సహాయ స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.


Latest News
 

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడున్నరేళ్ల నిరీక్షణకు తెర Mon, Apr 29, 2024, 09:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత, ఈ రెండ్రోజులు జాగ్రత్త Mon, Apr 29, 2024, 09:48 PM
రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి.. మా భవిష్యత్ ప్రణాళికలు ఇవే: సీఎం రేవంత్ Mon, Apr 29, 2024, 09:10 PM
కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్.. మరి తండ్రి పరిస్థితేంటి Mon, Apr 29, 2024, 09:04 PM
73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించిన తెలంగాణ హైకోర్టు.. నిజాం కాలం నాటి ఈ వివాదమేంటి. Mon, Apr 29, 2024, 08:59 PM