వదిన, మరిదుల మధ్య వివాహేతర సంబంధం..

byసూర్య | Tue, Oct 26, 2021, 10:54 AM

 వివాహేతర సంబంధాలు ఎందరో చావులకు కారణమవుతున్నాయి. తాజాగా వదిన, మరిదుల వివాహేతర సంబంధం చివరికి ఒకరి మరణానికి కారణమైంది. మరోకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ బంధం గురించి అందరికీ తెలుస్తోందని వదిన, మరి ఒకే చీరకు ఉరేసుకున్నారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటు చేసుకుంది.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యుడు ఆంజనేయులుకు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య అర్చన(23) తన భర్త కుటుంబంలో వరుసకు మరిది అయ్యే మధు(22)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఇతరులకు తెలియడంతో మనస్తాపానికి గురైన ఆ ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరూ కలిసి ఇంట్లోనే ఒకే చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మర్గమధ్యంలోనే అర్చన మృతి చెందింది. మరోవైపు మధు పరిస్థితి విషమంగా ఉంది. దాంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 


 


Latest News
 

ఈ నెల 18న హైదరాబాద్‌కు రానున్నాకేంద్రమంత్రులు, గోవా సీఎం Tue, Apr 16, 2024, 10:23 PM
సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM