జర్నలిస్ట్ రఘుకు మరో 14 రోజుల రిమాండ్

byసూర్య | Thu, Jun 10, 2021, 01:31 PM

నల్గొండ జిల్లా గుర్రంపోడు భూముల కేసులో జర్నలిస్ట్ రఘును మఠంపల్లి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు రఘుపై మఠంపల్లి స్టేషన్‌లో మరో కేసు తెరపైకి తెచ్చి పీటీ వారెంట్‌పై హుజుర్ నగర్ జైలు నుండి నల్గొండ జైలుకు తరలించారు. ఈ కేసులో వర్చువల్ ద్వారా విచారణ చేపట్టిన హుజుర్ నగర్ కోర్టు రఘుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.


ఇప్పటికే గుర్రంపోడు భూముల కేసులో రఘుకు రిమాండ్ విధించగా.. బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. గురువారం నాడు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక రఘుపై రోజుకో కేసు తెరపైకి తీసుకొస్తుండటంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రఘు భార్య హైకోర్టును ఆశ్రయించగా. రఘుపై ఎన్ని కేసులు ఉన్నాయో మొత్తం వివరాలు ఇవ్వాలని హైకోర్టు డీజీపీని ఆదేశించిన సంగతి విదితమే.


Latest News
 

మతతత్వ బిజెపిని ఓడించండి Mon, May 06, 2024, 01:57 PM
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ Mon, May 06, 2024, 01:54 PM
కంటోన్మెంట్ లో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 01:51 PM
మోడీ కోసం దేశమే ఎదురుచూస్తుంది: బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Mon, May 06, 2024, 01:50 PM
ఆమనగల్లులో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం Mon, May 06, 2024, 01:47 PM