నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం: కృష్ణయ్య
 

by Suryaa Desk |

టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. హిమాయత్ నగర లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ప్రతి ఫెడరేషన్‌కు రూ. 200 కోట్ల చొప్పున, బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల చొప్పున కేటాయించాలని డిమాండ్ చేశారు. నిరుపేద బీసీలకు రుణాలు ఇవ్వని బ్యాంకులు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. లేదంటే బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అన్ని రుణాలకు 80 శాతం సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న 5 లక్షల 33 వేల మందికి వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM