బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో భారీ మోసం...

byసూర్య | Thu, Oct 08, 2020, 12:52 PM

తెలంగాణలో బిట్ కాయిన్ వ్యాపారం పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. సిరిమల్ల నాగరాజు అనే కేటుగాడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆన్‌లైన్ బిట్ కాయిన్ పేరుతో నాలుగు వెబ్ సైట్లు సృష్టించి నిందితుడు దేశవ్యాప్తంగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.  తమ దగ్గర పెట్టుబడులు పెడితే 18 వారాల్లో అధికలాభాలతో చెల్లింపులు చేస్తానని నాగరాజు నమ్మించాడు. దీంతో దేశ వ్యాప్తంగా 1200 మంది పెట్టుబడులు పెట్టారు.


రూ. 50 కోట్ల వరకు పలువురునుంచి నాగరాజు వసూళ్లు చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఒక్క తెలంగాణలోనే 250 మంది నుంచి రూ. 10 కోట్లకుపైగా వసూలు చేశాడు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ స్కామ్‌లో మోసపోయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లి, గోదావరిఖనీ ప్రాంతాలకు చెందిన 250 మంది పోలీసులను కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM