31 మంది రోహింగ్యాలు అరెస్ట్

byసూర్య | Tue, Jan 22, 2019, 03:55 PM

త్రిపుర: అసోం బీఎస్‌ఎఫ్ అధికారులు త్రిపురలో 31 మంది రోహింగ్యా ముస్లింలను అరెస్ట్ చేశారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు మధ్య జీరో పాయింట్ వద్ద చిక్కుకున్న రోహింగ్యాలను బీఎస్‌ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్‌ఎఫ్ అధికారులు అగర్తలలోని అంటాలీ పోలీసులకు రోహింగ్యాలను అప్పగించారు. అరస్టైన వారిలో 12 మంది పిల్లలున్నారు. సోమవారం రాత్రి గువాహటికి చెందిన బస్సులో వచ్చిన రోహింగ్యాలు గత నాలుగు రోజులుగా జీరో పాయింట్ వద్ద ఉండిపోయారని త్రిపుర పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రోహింగ్యాలను విచారించి కరీంగంజ్ లోని స్థానిక కోర్టులో హాజరుపరుస్తామన్నారు.


Latest News
 

జహీరాబాద్ లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం Sat, May 04, 2024, 03:45 PM
బిఐఎఫ్ఆర్ నుండి సింగరేణిని కాపాడింది కాంగ్రెసే: జనక్ Sat, May 04, 2024, 03:44 PM
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీజేపీ యువ నాయకులు ప్రచారం Sat, May 04, 2024, 03:38 PM
వడదెబ్బతో రైతు మృతి Sat, May 04, 2024, 03:27 PM
ఓటు హక్కు వినియోగించుకోవాలి: మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ Sat, May 04, 2024, 03:20 PM