విమానానికి బాంబు బెదిరింపు కాల్

byసూర్య | Fri, Oct 25, 2024, 03:30 PM

దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబ్ బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. అక్టోబర్ 24న ఒక్కరోజే 95 విమానాలకు బాంబ్ బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే.. లేటెస్ట్ గా అక్టోబర్ 25న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.హైదరాబాద్ నుంచి చంఢీగర్ వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన CISF సెక్యూరిటీ విమానాన్ని క్షుణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో 130 మంది ప్రయాణికులను కిందకు దింపి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు.బాంబ్ బెదిరింపుతో ప్రయాణికులంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులంతా ఎయిర్ పోర్టులోనే ఉన్నారు. అధికారులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కాల్ చేసింది ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు.గడచిన 10 రోజుల్లో భారత్లో 250 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. వీటిల్లో 170 విమానాలకు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే బెదిరింపులు వచ్చినట్లు ప్రభుత్వం తేల్చింది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులు వ్యవహారానికి సంబంధించి 8 కేసులు నమోదు చేశారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM