బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట

byసూర్య | Fri, Oct 25, 2024, 03:13 PM

హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి భారీ ఊరట దక్కింది. కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా శ్యాం నాయక్ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఎన్నికల అఫిడవిట్లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు అజ్మీరా శ్యాం పిటిషన్ను కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవా లక్ష్మీ ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాంపై 22 వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ అజ్మీరా శ్యాం కోర్టుకు వెళ్లారు.


Latest News
 

తెలంగాణకు స్మార్ట్ షూ కంపెనీ.. 87 వేల మందికి ఉపాధి..! Fri, Oct 25, 2024, 05:48 PM
జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 05:47 PM
అనంతపురం: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం పోస్టర్లు విడుదల Fri, Oct 25, 2024, 05:36 PM
ధర్మవరం: డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పెంపు Fri, Oct 25, 2024, 05:33 PM
గుంతకల్లు: విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి Fri, Oct 25, 2024, 05:31 PM