వాళ్లే నా శత్రువులు.. నన్ను చంపితే స్వర్గానికే పోతా: కేఏ పాల్

byసూర్య | Sun, Oct 20, 2024, 06:50 PM

తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. మరోసారి కీలక కామెంట్స్ చేసి చర్చనీయాంశంగా మారారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సర్కార్లు అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని కొందరు.. తనను చంపాలని చూస్తున్నారంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ తనను చంపితే.. స్వర్గానికే పోతానని, వారు మాత్రం నరకానికే పోతారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో తనను చంపాలని అనుకున్న వారే ప్రాణాలు వదిలారంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతున్న నేపథ్యంలో.. భద్రత కల్పించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.


ప్రభుత్వాల అసంబద్ధ విధానాలపై కేసులు వేస్తున్నా.. కోర్టుల్లో పోరాడుతున్నా.. ఎన్నో కేసుల్లో స్టేలు తీసుకువస్తున్నానని తెలిపిన కేఏ పాల్.. తాను వేస్తున్న కేసులు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ మంచి కోసం తాను పని చేస్తూనే ఉంటానని కేఏ పాల్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తనకు ప్రధాన శత్రువేనని కేఏ పాల్ చెప్పుకొచ్చారు.


తెలంగాణలో.. రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగేలా సీఎం రేవంత్ రెడ్డి పాలన నడుస్తోందని.. ఆయన తన విధానాలను మార్చుకోవాలని కేఏ పాల్ సూచించారు. వేలాది మంది గ్రూప్-1 అభ్యర్థులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసు లాఠీ ఛార్జులు చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థులను గాయపరచడం సరైన చర్య కాదని మండిపడ్డారు. పరిపాలన చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటు డిమాండ్ చేశారు.


కొండా సురేఖ, దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి రౌడీల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేఏ పాల్. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ పదే పదే ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి.. సీబీఐకి ఎందుకు లెటర్ రాయటం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. పీస్ సమ్మిట్ నిర్వహించి.. 20 లక్షల కోట్ల అప్పు తీర్చుదామని.. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిద్దామంటూ కేఏ పాల్ పిలుపునిచ్చారు. మార్పు రావాలని ఆకాంక్షించే వాళ్లు నాకు మద్దతుగా నిలవాలని కేఏ పాల్ కోరారు.


హైదరాబాద్‌లో హైడ్రా అనేది ఓ డ్రామాల తయారైందని కేఏ పాల్ ఆరోపించారు. హీరో నాగార్జునకు ఒక న్యాయం, రేవంత్ రెడ్డి తమ్ముడికి ఒక న్యాయమా.. అని నిలదీశారు. భూకబ్జా చేసినోళ్లను పట్టుకోలేదు, అమ్మినోళ్లు, అనుమతులు ఇచ్చినోళ్లను వదిలేసి ఇండ్లు కట్టుకున్న పేదవాళ్లను మాత్రం అన్యాయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మూసీ పునర్జీవం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. లక్షన్నర కోట్లు ఎక్కడినుంచి తెస్తారంటూ కేఏ పాల్ ప్రశ్నించారు.


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM