దుబ్బాక లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

byసూర్య | Fri, Oct 18, 2024, 10:35 PM

దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాడు పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ మరియు పాలకమండలి సభ్యులు బోయ యాదగిరి గజబింకర్ బాలరాజ్, కాసం బాల్రెడ్డి, డిసిసి డైరెక్టర్ పూస దశరథం లు కలిసి కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 118 నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిగా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి కేవలం దుబ్బాక నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే  ప్రారంభించకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారు అన్నారు..ఆరుకాలం కష్టపడి పండించిన పంట వర్షాల పాలై పోతుంటే దుబ్బాక శాసనసభ్యులు కనీసం ఈ ప్రాంతంలో ఉన్న రైతులను పట్టించుకోకపోవడం ఈ ప్రాంత ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపెట్టడం బాధాకరమైన విషయం అని తెలిపారు..
సొంత వ్యాపారాలపై ఉన్నటువంటి. 
శ్రద్ధ ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యులుగా గెలిపించిన ప్రజలపై లేకపోవడం బాధాకరమని తెలిపారు.. రాష్ట్ర వాతావరణ శాఖ ఈ జిల్లాలో వర్షాపాతం ఉందని తెలియజేసిన ఇంతవరకు వడ్ల కొనుగోలు సెంటర్ లను పట్టించుకున్న పాపాన పోలేడు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మున్సిపల్ పట్టణ అధ్యక్షులు యేసురెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొంగర రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు ఆనంతుల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,దుబ్బాక నియోజక వర్గ యువజన జనరల్ సెక్రటరీ ఆకుల భరత్, పట్టణ జనరల్ సెక్రెటరీ మంద శ్రీనివాస్,మార్కెట్ కమిటీ మాజీ వైస్ చెర్మన్ ఆకుల దేవేందర్ విజయ్, రాజు, వెంకట్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM