చదువుతో పాటు కళల పై ఆసక్తి పెంచుకోవాలి- అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్

byసూర్య | Fri, Oct 18, 2024, 10:29 PM

విద్యార్థులు చదువుతోపాటు వివిధ సాహిత్య కళలపై ఆసక్తి పెంచుకోవాలని  అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.గురువారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో , ఎంఆర్పి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళా ఉత్సవ జిల్లా స్థాయి పోటీలను ప్రారంభించారు.
కళా ఉత్సవ జిల్లా స్థాయి పోటీలో భాగంగా విద్యార్థులకు  సాంప్రదాయ నృత్యం, జానపద నృత్యం ,చిత్రలేఖనం, వాయిద్య పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ,   కళలు సృజనాత్మకతను పెంచుతాయని మనలో దాగి ఉన్న కళలను బహిర్గతం చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు కళల పై కూడా ఆసక్తి పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి మాట్లాడుతూ కళా ఉత్సవ పేరిట సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడి ఢిల్లీలో జాతీయ స్థాయిలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమంలో ఏఎంఓ డాక్టర్ పీఏం షేక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM