12 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

byసూర్య | Fri, Oct 18, 2024, 09:27 PM

ప్రస్తుత సమాజంలో ఆడి పిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. నెలల వయస్సున్న చిన్నారి నుంచి వృద్ధుల వరకు వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. కామాంధుల కామ దాహానికి బలైపోతూనే ఉన్నారు. దేశంలో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో మహిళలు, ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా.. కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై 71 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మనవరాలి వయస్సున్న చిన్నారిని కాటేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వళితే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహా ముత్తారం మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలిక (12)పై వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన రామయ్య (71) అనే వృద్ధుడు పక్కింట్లో ఉంటున్న బాలికపై కన్నేశాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. పక్కింట్లో ఉండేవాళ్లు వచ్చేలోపు రామయ్య అక్కడి నుంచి పరారయ్యాడు.


బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామయ్యను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాత వయస్సున్న వ్యక్తి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటంపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకరు ఇటువంటి తప్పు చేయాలంటే బయపడేలా శిక్ష విధించాలని కోరుతున్నారు.


కాగా, ఇటీవల వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని ఓ గ్రామంలోనూ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూలేని సమయంలో ఇంటి పక్కనే ఉండే బాలికపై కన్నేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక అనారోగ్యం బారిన పడగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చిందన్నారు. బాలికను గట్టిగా అడగ్గా జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM