ఫాస్ట్‌పుడ్ సెంటర్లకు కుళ్లిన కోడి మాంసం.. 7 క్వింటాళ్ల చికెన్ సీజ్, విస్తుపోయే నిజాలు

byసూర్య | Fri, Oct 18, 2024, 09:08 PM

ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, మద్యం దుకాణాల్లోని పర్మిట్‌ రూమ్స్‌లో చికెన్ ఐటమ్స్ ఇష్టంగా తింటున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూస్. కుళ్లిన చికెన్‌తో ఆయా చికెన్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ బేగంపేటలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌ సెఫ్టీ అధికారులు భారీగా కుళ్లిన చికెన్‌ను సీజ్ చేసారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఏడు క్వింటాళ్ల చికెన్‌ను అధికారులు సీజ్ చేశారు.


బేగంపేటలోని బాలయ్య చికెన్ సెంటర్‌లో నేడు ఉదయం ఫుడ్ సెఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అక్కడ వందల కేజీలకొద్ది పేరుకుపోయిన కుళ్లిపోయిన కోడి మాంసాన్ని గుర్తించారు. చికెన్‌తో పాటుగా కొవ్వు పదార్థాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన కోడి మాంసానికి కెమికల్స్ వేసి ఆ చికెన్‌ను నగరంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మద్యం దుకాణాల్లోని పర్మిట్‌ రూంలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని జనతా బార్‌లకు సైతం ఈ కుళ్లిన కోడి మాంసాన్ని సప్లయ్ చేస్తున్నట్లు తేలింది.


మెుత్తం ఏడు క్వింటాళ్ల కుళ్లిపోయిన కోడి మాంసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య చికెన్ సెంటర్‌ను సైతం సీజ్ చేసి.. జనతా బార్‌లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేయటంపై ఆరా తీస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బార్లే కాకుండా ఇంకా ఎక్కడెక్కడ చికెన్ సరఫరా చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టారు. బాలయ్య చికెన్ సెంటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏడు క్వింటాళ్ల కుళ్లిన చికెన్ దొరకటం అది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, బార్లకు సరఫరా చేస్తున్నట్లు తెలియటంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కాగా, బయట ఫుడ్ తినేవారు జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సెఫ్టీ అధికారులు, డాక్టర్లు సూచిస్తున్నారు. బయట మార్కెట్‌లో చాలా వరకు కల్తీ ఫుడ్ విక్రయిస్తున్నారని.. బయట తినకపోవటమే మంచిదని చెబుతున్నారు. ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పధార్థాలు మాత్రమే తినాలని లేదంటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM