9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఓయూ వైస్‌ ఛాన్స్‌లర్‌గా కుమార్

byసూర్య | Fri, Oct 18, 2024, 09:04 PM

 రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వీసీల పేర్లతో కూడిన నియామక దస్త్రాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించగా.. ఆయన సంతకం చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా కొత్త వీసీల నియమాకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 9 యూనివ‌ర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యానవన విశ్వ విద్యాలయం ఉన్నాయి.


అయితే వీసీల నియామకానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 1380కిపైగా అప్లికేషన్లు రావడంతో వీసీల ఎంపిక బాధ్యతను తెలంగాణ విద్యాశాఖ సెర్చ్‌ కమిటీలకు అప్పగించింది. ఆ దరఖాస్తులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సెర్చ్‌ కమిటీ.. చివరికి ఒక జాబితాను తయారు చేసి ఇటీవలె గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మకు పంపించింది. ఆ జాబితాను పరిశీలించిన గవర్నర్‌.. చివరికి ఆమోదం కల్పించారు. దీంతో 9 వర్సిటీలకు వీసీలను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.


యూనివర్సిటీ పేరు- కొత్త వీసీ


ఉస్మానియా యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ కుమార్


కాక‌తీయ యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి


మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ అల్తాఫ్‌ హుస్సేన్


తెలంగాణ యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ యాద‌గిరి రావు


పాల‌మూరు యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్


తెలుగు యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ నిత్యానందరావు


శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ - ప్రొఫెసర్ ఉమేష్ కుమార్


ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర‌ల్ యూనివ‌ర్సిటీ - అల్దాస్ జాన‌య్య


కొండా ల‌క్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాల‌యం - ప్రొఫెస‌ర్ రాజిరెడ్డి


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM