నన్ను చంపేస్తామని బెదిరించినవారే చచ్చారు.. కేఏ పాల్ శాపనార్థాలు

byసూర్య | Fri, Oct 18, 2024, 09:01 PM

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని చూసిన వారు ప్రపంచంలో ఉన్నవారు అందరూ చచ్చారని తెలిపారు. మీరు చనిపోవాలి అనుకుంటే.. తనను చంపాలని ఆలోచన తెచ్చుకోవాలని సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా తనను చంపాలని బెదిరింపు కాల్స్ చేస్తున్న వారికి గట్టిగా హెచ్చరికలు చేస్తూనే వారికి శాపనార్థాలు పెట్టారు. తాను తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై కేసులు వేశానని.. అయితే వారు డిస్‌క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అందుకే తనకు బెదిరింపులు వస్తున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు.


"నేను దేవుడు పంపగా వచ్చాను. మంచి చేయడానికి వచ్చాను. ప్రజల కొరకు పోరాటం చేయడానికి వచ్చాను. అలాంటిది నా మీద మీరు కుట్రలు పన్నుతారా. నాకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించాను. ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇస్తా అంటోంది. కానీ నాకు సెక్యూరిటీ ఆ దేవుడే. నన్ను చంపాలనుకున్నవారు కలలో కూడా బాగుపడరు. నన్ను చంపాలని ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కరు చస్తారు. చచ్చిన తర్వాత మీరు నరకానికి వెళ్తారు. నేనైతే స్వర్గానికి వెళ్తాను. ఎందుకంటే నేను పుట్టిన తర్వాత అంతా మంచే చేశాను. అనాథలు, వితంతువులను ఆదుకున్నాను. యువతకు ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పాను" అంటూ కేఏ పాల్ తీవ్ర శాపనార్థాలు పెట్టారు.


ఇక తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని.. అయితే వాళ్లకు ఒక నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటని కేఏ పాల్ ప్రశ్నించారు. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 7 హామీలను అక్కడి ప్రజలు నమ్మలేదని.. అందుకే ఓడించారని మండిపడ్డారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు అమలు చేయట్లేదని ఆరోపించాన్నారు


ఇక తాను సీఎం రేవంత్ రెడ్డితో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని కేఏ పాల్ వెల్లడించారు. ఆయన దక్షిణ కొరియాకు వెళ్లి కూడా టూరిస్ట్‌గా తిరిగివచ్చాడే తప్ప.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయలేదని విమర్శించారు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైతే.. మన దగ్గర దరిద్రం ఎక్కువైందని కేఏ పాల్ పంచ్‌లు వేశారు.


Latest News
 

మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM
జిల్లా గ్రంధాలయాల చైర్మన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న స్పీకర్ Fri, Oct 18, 2024, 10:38 PM