byసూర్య | Tue, Oct 15, 2024, 02:47 PM
VLF స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వికారాబాద్(D) దామగుండం రిజర్వు ఫారెస్టులో మంగళవారం రాడార్ స్టేషన్ నిర్మాణానికి సీఎంతో కలిసి రాజ్‌నాథ్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. అబ్దుల్ కలాం జయంతి నాడు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశాభివృద్ధిలో TG పాత్ర కీలకంగా మారిందన్నారు. పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని సూచించారు.